SA vs BAN: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం

Bangladesh Won 1st ODI vs SA Got First Victory In South Africa Tour - Sakshi

సొంత మైదానంలో ఏ జట్టైనా బలంగా ఉంటుంది. ప్రత్యర్థి జట్లకు అవకావం ఇవ్వకుండా మ్యాచ్‌లను సొంతం చేసుకోవడం చూస్తుంటాం. కానీ టీమిండియాను మట్టికరిపించిన సౌతాఫ్రికాకు వారి సొంతగడ్డపైనే బంగ్లాదేశ్‌ షాక్‌ ఇచ్చింది. సెంచురియన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రొటిస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే తొలి విజయం కావడం విశేషం. 

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 77 పరుగులు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించగా.. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ 50, కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ 41 పరుగులతో రాణించగా.. చివర్లో యాసిర్‌ అలీ 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు 48.5 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వాండర్‌ డసెన్‌ (86), డేవిడ్‌ మిల్లర్‌(79).. మిడిలార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడినప్పటికి మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌ 4, తస్కిన్‌ అహ్మద్‌ 3, షోరిఫుల్‌ ఇస్లామ్‌ 2, మహ్మదుల్లా ఒక వికెట్‌ తీశాడు.

ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే వాండరర్స్‌ వేదికగా మార్చి 20న జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌ అనంతరం బంగ్లాదేశ్‌.. సౌతాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. 

చదవండి: IPL 2022: ధోనిని క్లీన్‌బౌల్డ్ చేశా.. ఇప్పుడు నా టార్గెట్ కోహ్లి భాయ్‌'

Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top