చరిత్ర సృష్టించిన అనామక ప్లేయర్‌ | 15-year-old Rwanda batter scripts history with Womens T20I century on debut | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన అనామక ప్లేయర్‌.. అరంగేట్రంలో వరల్డ్ రికార్డు

Mar 21 2026 7:44 AM | Updated on Mar 21 2026 8:35 AM

15-year-old Rwanda batter scripts history with Womens T20I century on debut

రువాండాకు చెందిన టీనేజ్‌ క్రికెటర్‌ ఫ్యానీ ఉతగుషుమనిందే అరంగేట్రంలోనే సెంచరీతో చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మహిళల టి20ల్లో ‘శత’క్కొట్టిన అతిపిన్న వయష్కరాలిగా ఫ్యానీ (15 ఏళ్ల 223 రోజులు) రికార్డు నెలకొల్పింది. ఉగాండా ప్లేయర్‌ ప్రొస్కోవియా అలకో (16 ఏళ్ల 233 రోజులు; 2019లో మాలి జట్టుపై) పేరిట ఉన్న రికార్డును ఫ్యానీ బద్దలు కొట్టింది.

నైజీరియాలో జరుగుతున్న ఇంటర్ననేషనల్‌ టి20 టోర్నీలో భాగంగా ఘనాతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యానీ 65 బంతుల్లో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే శతకం, అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మహిళా బ్యాటర్‌గా ఘనతకెక్కింది. ఆమె మెరుపు శతకం 21 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 

2005లో అప్పుడే మొదలైన మహిళల అంతర్జాతీయ టి20లో ఆస్ట్రేలియన్‌ బ్యాటర్‌ తన అరంగేట్రం మ్యాచ్‌లో కరెన్‌ రోల్టన్‌ (96 నాటౌట్‌) ఇంగ్లండ్‌పై రికార్డు సృష్టించింది.  ఫ్యానీ ధనాధన్‌ షోతో రువాండా 20 ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం ఘనా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 88 పరుగులే చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement