
పర్యావరణహిత ఇటుకల తయారీ
ప్రదర్శించిన విద్యార్థులు
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ పర్యవేక్షణలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో పర్యావరణహిత ఇటుక (ఎకో బ్రిక్స్)లను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రామకృష్ణ మాట్లాడుతూ..ప్రపంచాన్ని పీడిస్తు న్న పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడంతోపాటు ప్లాస్టిక్ చెత్త రీసైక్లింగ్, కంపోస్ట్ ఎరువుపై ప్రజల్లో చైతన్యం కల్పించటమే ఈ ప్రదర్శన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నవనీత, సునీత పాల్గొన్నారు.