
మంచి ఫలితాలు సాధించేందుకే సదస్సులు
ఇంపాక్ట్ రీజినల్ అధ్యక్షుడు రాజేశ్వర్
అల్లాదుర్గం(మెదక్): ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఇంపాక్ట్ సంస్థ సంగారెడ్డి జిల్లా రీజినల్ అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం అల్లాదుర్గం కేజీబీవీ, ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో పదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపిక, పారితోషికం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ రీజినల్ కార్యదర్శి నర్సింహరెడ్డి, కోశాధికారి లావణ్య, సర్వీస్ కోఆర్డినేటర్ రమేశ్, కేజీబీవీ ప్రిన్సిపాల్ స్రవంతి, ఎస్‌ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.