
క్రీడలకు మరింత ప్రోత్సాహం
క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య
సిద్దిపేటజోన్: సిద్దిపేట క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్ నర్సయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఫుట్‌బాల్ మైదానంలో జిల్లా జూనియర్ బాలికల జట్టు సెలక్షన్స్ ప్రక్రియను జిల్లా క్రీడా సమాఖ్య కన్వీనర్ సాయిరాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా జూనియర్ బాలికల జట్టును ఎంపిక చేసినట్లు సెలక్షన్స్ కమిటీ సభ్యులు అక్బర్ తెలిపారు. ప్రతిభ ఆధారంగా 20మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు ఈనెల 8నుంచి ఆదిలాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వడ్లకొండ చైతన్యశ్రీ జాతీయ స్థాయి అండర్ –17 ఫుట్‌బాల్ ప్రాబబుల్స్‌కు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్, జాయింట్ సెక్రటరీ సాజిద్ పాల్గొన్నారు.