
చేపల వేట నిషేధం
జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కార్ప్ జాతికి చెందిన చేపలు పిల్లలను జూలై, ఆగస్టు నెలల్లో ఉత్పత్తి చేస్తాయని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, రంగనాయకసాగర్, అన్నపూర్ణ సాగర్ ప్రాజెక్టులలో లైసెన్స్ పొందిన మత్స్యకారులు రెండు నెలలు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా చేపల వేటకు వెళితే మత్స్యకారుల లైసెన్స్‌లు రద్దు చేయబడుతాయని తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
చేగుంట(తూప్రాన్): వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన షౌకత్(44) చేగుంటలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల పరిసరాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అతడి భార్య రుబీనాబేగం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.