
విద్యార్థులతోనే పాఠ్యాంశాలు చదివించాలి
మునిపల్లి(అందోల్): విద్యార్థినులతో ఒకటికి రెండు సార్లు ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను చదివించాలని జీసీడీఓ (గల్స్ చైల్డ్ డెవలప్ మెంట్) అధికారి సుప్రియ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని తాటిపల్లి కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు రికార్డులు, వంట గదులు, తాగునీటి సౌకర్యం, నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేరా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో ఒకరి కంటే ఒకరు పోటీపడి చదవాలన్నారు. అప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని తెలిపారు. ప్రహరీగోడ, అదనపు తరగతి గదులు, ఇంటర్మీయెట్‌కు రెగ్యూలర్ అధ్యాపకులను ఏర్పాటు చేయడానికి జిల్లా అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.