
పూజ గదిలో మంటలు
కల్హేర్(నారాయణఖేడ్): పూజ గదిలో మంటలు వ్యాపించి ఇంటితోపాటు బంగారం, వెండి వస్తువులు, నగదు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం సిర్గాపూర్ మండలం నల్లవాగులో జరిగింది. గ్రామానికి చెందిన చిల్లెల నాగయ్య కుటుంబం నిత్యం ఇంట్లో పూజ గదిలో పూజలు చేస్తారు. దీపం వెలిగించి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. దీపం కారణంగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి నారాయణఖేడ్‌లోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పింది. ప్రమాదంలో ఇంటి కప్పు, 8 తులాలకు పైగా బంగారం, 26 తులాల వెండి వస్తువులు, బట్టలు, రూ.1.98 లక్షలు నగదు కాలిపోయింది. పిల్లి దీపం పడేయడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.
ఇంటితోపాటు బంగారం, నగదు దగ్ధం
సిర్గాపూర్ మండలంనల్లవాగులో ఘటన