చేవెళ్ల: యువత క్రీడల్లో రాణించాలని చేవెళ్ల ఎ మ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద వార్డులో శనివారం 7వ జిల్లాస్థాయి, ఓపెన్ టు ఆల్ వాలీబాల్ టోర్నమెంట్–2026 పోటీలను ఆయన మున్సిపల్ చైర్‌పర్సన్ దేవరి సమతావెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాకారులను తగిన విధంగా పోత్రహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో ఉండే యువత మంచి క్రీడాకారులుగా తల్లిదండ్రులు, దేశానికి పేరు తీసుకువచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు తాల్లపల్లి నర్సింలు, పైండ్ల మధుసూదన్‌రెడ్డి, బండారి శైలజఆగిరెడ్డి, మాజీ సర్పంచులు మధుసూదన్‌గుప్తా, వెంకటేశంగుప్తా తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


