యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

Sep 25 2023 3:52 AM | Updated on Sep 25 2023 3:52 AM

హైదరాబాద్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఓ భవనం  - Sakshi

హైదరాబాద్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఓ భవనం

అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. జీప్లస్‌ టుకు అనుమతులు తీసుకుని సెల్లార్లు తవ్వి ఏకంగా ఐదు, ఆరు అంతస్తుల్లో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో ప్రజలు విమర్శిస్తున్నారు.

శంకర్‌పల్లి: మున్సిపాలిటీ పరిఽధిలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పరిమితికి మించి అంతస్తుల్లో భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ వైపు అక్రమనిర్మాణాలపై ఉన్నతాధికారులు కొరడా ఝలిపిస్తుంటే మున్సిపల్‌ అధికారుల తీరుతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

మున్సిపల్‌ ఆదాయానికి గండి

పట్టణ కేంద్రంలోని హైదరాబాద్‌, సంగారెడ్డి రోడ్డు, పత్తేపురం రోడ్డులో గజానికి రూ.లక్ష పైగా ఉంది. దీంతో అక్కడ స్థలాలున్న యజమానులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. సంబంధిత అధికారులు ముడుపులు ముట్టజెప్పడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్‌ పరిధిలో జీప్లస్‌ టూ వరకే అనుమతులు ఇచ్చే అధికారం ఉంటుంది. అంతకు మించి అంతస్తులు నిర్మించాలంటే హెచ్‌ఎండీఏ అనుమతులు తప్పనిసరి. కానీ కొందరు యజమానులు సెల్లార్లు తవ్వి మూడు నుంచి ఆరు అంతస్తుల వరకు నిర్మించి టూలెట్‌ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. బహుల అంతస్తులు నిర్మించిన యజమానులు సెల్లార్లలోనూ వ్యాపార కార్యకలపాలు నిర్వహించుకునేందుకు అద్దెకు ఇస్తున్నారు. ఇందుకు మున్సిపాలిటీ ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారు మాత్రం సెల్లార్‌ను పార్కింగ్‌గా చూపుతూ మున్సిపల్‌ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి కోరుతున్నారు.

గొల్లవాగు కబ్జా

మున్సిపల్‌ పరిధిలోని గొల్లవాగు కబ్జాకు గురవుతోంది. ఇటీవల ఓ వెంచర్‌ యాజమాన్యం క్లబ్‌ హౌజ్‌ నిర్మాణం చేపట్టింది. కొందరు నాయకులు వాగులోకి వరద రాకుండా మట్టిని నింపి కబ్జాకు తెరలేపారని పలువురు చర్చించుకుంటున్నారు. గొల్లవాగు సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్లపైనే పార్కింగ్‌

మున్సిపల్‌ పరిధిలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, బ్యాంకులు, షాపింగ్‌మాల్స్‌ వెలిశాయి. ఈ భవనాల్లోని సెల్లార్లలోనూ వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో వాహనాలను రోడ్లపైనే పార్క్‌ చేస్తున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.

రెండతస్తులకు అనుమతులు బహుళ అంతస్తుల్లో భవనాలు

నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్మాణం

పట్టించుకోని మున్సిపల్‌ అధికారులు

చర్యలు తీసుకుంటాం

మున్సిపల్‌ పరిధిలో సెల్లార్ల నిర్మాణానికి అనుమతులు లేవు. ఎవరైనా ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా సెల్లార్‌లను ఏర్పాటు చేసి అద్దెకు ఇచ్చిన వారిని గుర్తించి నోటీసులు అందిస్తాం. పరిమితి మించి అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తే కూల్చేస్తాం.

– జ్ఞానేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, శంకర్‌పల్లి

పత్తేపురం తీగల వాగు పక్కన సెల్లార్‌తో నిర్మిస్తున్న భవనం 1
1/1

పత్తేపురం తీగల వాగు పక్కన సెల్లార్‌తో నిర్మిస్తున్న భవనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement