
బాలకార్మికులు లేకుండా చూడాలి
● ఆపరేషన్ ముస్కాన్‌పై దిశ నిర్దేశం ● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: జిల్లాలో బాలకార్మికులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో బాధ్యతగా పనిచేయాలన్నారు. బాలకార్మికులను బడిలో చేర్పించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై పోలీస్ కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 10 రోజుల్లో 31 మంది పిల్లలను సీడబ్ల్యూసీ ముందు హాజరుపరచగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. మైనర్లతో పనిచేయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలలో తనిఖీలు చేయాలన్నారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, సీఎంసీ చైర్‌పర్సన్ అంజయ్య, సీఐ నాగేశ్వరరావు, ఎస్సై లింబాద్రి, లక్పతి, అసిస్టెంట్ లేబర్ అధికారి నజీర్ అహ్మద్, మెడికల్ అండ్ హెల్త్ బాధ్యులు నయీమ్ జహార్, విద్యాశాఖ బాధ్యులు శైలజ, ఏఎస్సై ప్రమీల, మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా పాల్గొన్నారు.