DK Shivakumar v Siddaramaiah: సీఎం ఈయనే.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అభిమానుల పోస్టర్ వార్..

Siddaramaiah Dk Shivakumar Fans Poster War Ahead Of Cm Selection - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీఎం ఎంపికపైనే ఉంది. సీనియర్ లీడర్ సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ఖరారు చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ ఇద్దరి నేతల అభిమానులు మాత్రం పోస్టర్ల వార్‌కు దిగారు. తమ నేతనే సీఎంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ డీకే ఫ్యాన్స్ ఆయన ఇంటి ముందు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అటు సిద్ధరామయ్య మద్దతుదారులు కూడా తమ నేతనే సీఎంగా ప్రకటించాలని ఆయన నివాసం బయట పోస్టర్లు కట్టారు. దీంతో అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. పోస్టర్లు, బ్యానర్లు కట్టినంత మాత్రాన వారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయరని పేర్కొన్నారు. అధిష్టానమే అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని సీఎం ఎవరనేదని ఖరారు చేస్తుందని వ్యాఖ్యానించారు.

కాగా.. సీఎం ఎంపిక కోసం కర్ణాటక శాసనసభ పక్షం బెంగళూరులో సమావేశమైంది. ఈ భేటీకి ఏఐసీసీ పరీశీలకులుగా సుషీల్ కుమార్ షిండే, దీపక్ బవారియా, భన్వార్ జీతేంద్ర సింగ్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని అధిష్టానానికి నివేదికలో సమర్పించనున్నారు. నివేదిక అందిన అనంతరం కర్ణాటక సీఎం ఎవరని అధిష్టానం ప్రకటించనుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుంది.

ఎన్నో త్యాగాలు చేశా..
సిద్ధ రామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని డీకే శివకుమర్‌ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎన్నోసార్లు త్యాగం చేసి ఆయనకు మద్దతుగా నిలిచానని తెలిపారు. సిద్ధరామయ్యకు పూర్తి సహకారం అందించినట్లు సీఎల్పీ సమావేశానికి ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయదుందుభి.. 135 సీట్లతో భారీ మెజార్టీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top