Minister RK Roja Slams Chandrababu And Lokesh - Sakshi
Sakshi News home page

‘లోకేష్ యాత్రను చూసి యువత పారిపోతోంది’

Feb 26 2023 2:56 PM | Updated on Feb 26 2023 4:12 PM

Minister RK Roja Slams Chandrababu And Lokesh - Sakshi

సాక్షి, తిరుపతి:  నారా లోకేష్‌ పాదయాత్రకు జనాలు రావడానికి భయపడుతుంటే, ఆ యాత్రను చూసి యువత పారిపోతోందని మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. పాదయాత్రలో కనీసం పదిమంది నాయకులు కూడా లేరని, అది ఫెయిల్యూర్‌ యాత్ర అని మండిపడ్డారు రోజా.

తిరుపతిలో సాక్షి టీవీతో మాట్లాడిన ఆర్‌కే రోజా..  ‘ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు నందమూరి కుటుంబం గుర్తుకు రాలేదు. కష్టాల్లో ఉన్పప్పుడే చంద్రబాబుకు నందమూరి కుటుంబం గుర్తుకు వస్తుంది. చంద్రబాబు, లోకేష్‌లు పార్టీని లాక్కున్న దొంగలు... పార్టీ పెట్టిన వ్యక్తి మనవడిని లోకేష్ ఆహ్వానించడం దారుణం. చంద్రబాబు, లోకేష్, పవన్ వల్ల ఉపయోగం లేదని అర్థం అవుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను పిలుస్తున్నారు’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement