
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీసీల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడని, సరైన అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఏలూరులో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు ప్రయోజనం జరుగుతోందని స్పష్టం చేశారు.
సినిమాల్లో రాక్షసుల మాదిరిగా కొందరు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ వల్ల కాపులకు ఎలాంటి మేలు జరగలేదని తెలిపారు. గతంలో ఎప్పుడైనా రాజ్య సభ, ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్య.. గెలుస్తుందని అనుకునే స్థానాల్లో సీఎం రమేష్ లాంటి నాయకులకు టీడీపీ టికెట్‌లు ఇచ్చిందని విమర్శించారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ వల్ల కాపులకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు.
ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స ఏం మాట్లాడారంటే..
తోచిందల్లా మాట్లాడడం..:
- పార్టీ పెట్టినప్పటి నుంచీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి జగన్‌గారు కృషి చేశారు.
- అధికారంలోకి వచ్చాక ప్రజలకి ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తున్నారు.
- అదే సెలబ్రిటీ పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ మూడ్ వచ్చినప్పుడు ఏదో ఒక అంశంపై మాట్లాడతాడు.
- క్షుణ్ణంగా పరిశీలించకుండా, నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు.
- అలాంటి సందర్భాల్లో నా వంటి వారి పేర్లు ప్రస్తావిస్తాడు.
- రాష్ట్రంలో నేనూ ఉన్నాను అని చెప్పుకోవడం కోసం మళ్లీ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు
- పక్క రాష్ట్రంలో 26 బీసీ కులాలను జాబితా నుంచి తొలగిస్తే బొత్స ఏం చేస్తున్నారు అని ఆయన అడుగుతున్నాడు
- నాయకత్వం వహిస్తున్న వారు, రాజకీయాల్లో ఏదో సా«ధిద్దాం అనేవారు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మాట్లాడాలి.
ఎందుకు ప్రశ్నించలేకపోయారు?
- 2014లో విభజన తర్వాత తెలంగాణా రాష్ట్రంలో 26 బీసీ కులాలను తీసేశారు.
- అప్పుడు మేం అధికారంలో లేకపోయినా ఆ ప్రభుత్వాన్ని తప్పు అని ప్రశ్నించాం.
- ఆ అంశంపై మేం న్యాయ స్థానానికి వెళ్లడానికి కూడా ప్రయత్నాలు చేశాం.
- మా సంగతి సరే.. నువ్వేం చేశావ్?. 2014లో మీరు బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లారు కదా?.
- అటు కేంద్రంలో మోదీ గారికి వత్తాసు పలికారు. ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో జతకట్టి వెళ్లారు కదా?
- మీ అదృష్టమో లేక దురదృష్టమో రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి
- మరి మీరు ఆ 26 కులాల అంశంపై ఎన్నిసార్లు మాట్లాడారు?. తెలంగాణ ప్రభుత్వ తప్పుడు నిర్ణయంపై మీరు చేసిన పోరాటం ఏమిటి?.
- అప్పుడు చంద్రబాబుతో కలిసి మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు?
- కేంద్రంలో బీజేపీని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు..?
పవన్‌ను చూస్తే జాలేస్తోంది
- పవన్‌కళ్యాణ్‌ని చూస్తుంటే ఒక్కో సారి నాకు జాలి వేస్తుంటుంది.
- రాష్ట్రంలో 2 లక్షల కోట్ల డీబీటీలో ఇస్తే దానిలో 50 శాతం బీసీల కోసమే ఖర్చు చేసిన ప్రభుత్వం మాది.
- ఇది వాస్తవం. లెక్కలతో సహా మేము చెప్పడానికి సిద్ధం.
- నిజానికి చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదు. అందుకే పవన్‌కళ్యాణ్‌తో మాట్లాడిస్తున్నాడేమో అనిపిస్తోంది.
- నిన్న గాక మొన్న 18 ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 11 మంది బీసీలే.
- రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అయినా గతంలో అలా టికెట్లు ఇచ్చిందా?.
- చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేయలేక పోయింది.
- రాజ్యసభలో బీసీలకు ఇచ్చిన సీట్లు లెక్కలోకి రావా..?
- పవన్ కళ్యాణ్ అసలు ఏం చెప్పదలుచుకున్నాడో అర్ధం కావడం లేదు.
- బీసీలను ఈ ప్రభుత్వం కాపాడలేక పోయిందని చెప్పాలనుకుంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏ రకంగా కాపాడిందో బేరీజు వేసి చెప్పాల్సింది
కులం లేదంటాడు. కానీ..
- కాసేపు కులం లేదంటాడు. మళ్లీ కాసేపటికే కులం కులం అంటాడు.
- సమాజంలో అన్ని కులాలు మనకు సమానమే అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
- అందరూ సమష్టిగా బతకాల్సిందే. కానీ అనాదిగా ఒక మతం, కులం అనేది వచ్చింది.
- నేను కాపుల్లో పుట్టానని గతంలోనే చెప్పాను. నా కులాన్ని ప్రభుత్వం బీసీల్లో చేర్చింది.
- ఆ కులం నుంచే నేను ప్రాతిని«థ్యం వహిస్తున్నానని స్పష్టంగా చెప్పాను
- పవన్ కళ్యాణ్‌లా నాకు కులం లేదు.. అంటూ గంటకో మాట మాట్లాడటం లేదు.
- తూర్పు కాపుల్లో బొత్స సత్యనారాయణ ఒక్కడే మంత్రి అయితే ఆ కులం బాగు పడుతుంది అనుకుంటే పొరపాటే
- నా కంటే ముందు కళా వెంకట్రావు ఉన్నాడు. మృణాళికమ్మ, నారాయణస్వామి, శ్రావణ్ లాంటి తూర్పు కాపు నాయకులు చాలా మంది ఉన్నారు.
- అసలు పవన్ కళ్యాణ్ ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నాడో చెప్పాలి.
ప్రభుత్వంపై బురద చల్లడమే ఎజెండా:
- ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు.
- ఏదో ఒక వర్గాన్ని లోబరుచుకోవాలనే తాపత్రం ఆయనలో కనిపిస్తోంది
- అసలు ఏమీ లేకుండానే ఏదేదో మాట్లాడితే ఎలా..?
- జగన్ గారి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది
- బ్యాక్ వర్డ్ క్యాస్ట్ అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు
- మనిషికి వెన్నెముకకు ఉన్నంత ప్రాధాన్యత బలహీనవర్గాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ గారు చెప్పారు
- 26 కులాల తీసివేత విషయంలో మేం పట్టించుకున్నాం...అయినా ఆ ప్రభుత్వం తన విధానంలో వెళ్లింది..
- నువ్వెప్పుడైనా ఆ విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడావా..? సమాధానం చెప్పాలి
- నాకంటే ముందు పది మంది వరకూ తూర్పు కాపులు మంత్రులయ్యారు కదా...వారి వల్ల బాగుపడ్డది ఉందా...నేను చెడగొట్టింది ఉందా..?
నీ వల్ల కాపులకు ఒరిగిందేంటి..?
- సెలబ్రిటీ పార్టీ నాయకుడిగా తమరేమైనా కాపులకు చేస్తే.. కాపులకు ఏమైనా ఒరిగిందా..?
- నీలా గంటకో కులం కాదు.. నా కులం తూర్పు కాపే
- తరతరాలుగా వస్తున్న కులాన్ని చెప్పుకోవడానికి సిగ్గేంటి..?
- ఒక కులాన్ని కించపరిస్తే..ఇబ్బంది పెడితే చట్టబద్దంగా ప్రజాస్వామ్యంలో తప్పు కానీ కులం పేరు చెప్పుకుంటే కాదు
- నీ కులాన్ని నువ్వెందుకు చెప్పుకోవడం లేదు..?
- ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని రీచ్ కావడానికి నిజాయితీగా ప్రజల్ని మొప్పించే దిశగా ఉండాలి
- వాళ్ల మీద వీళ్ల మీద రెండు మాటలు మాట్లాడి వెళ్లడం రాజకీయం కాదు
- ఇలాంటివన్నీ ఆపి నిర్మాణాత్మకంగా ఆలోచనతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ∙ముపై ్ప నలభై ఏళ్ల తర్వాత ఫలితాలుంటాయి..ఇప్పుడుండవు
బీసీలే మాకు వెన్నెముక
- మళ్లీ మళ్లీ చెబుతాం. మా పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ.
- రాజశేఖరరెడ్డిగారి స్ఫూర్తితో పార్టీ ఏర్పాటు చేసిన జగన్‌గారు అదే దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు
- అందుకే మా మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీత అని మేం స్పష్టంగా చెప్తున్నాం
- ఏలూరు డిక్లరేషన్‌లో మేం ఏదైతో చెప్పామో బీసీలకు వాటన్నిటినీ అమలు చేస్తున్నాం
ఓడిపోతే వర్ల రామయ్య.. గెలిస్తే సుజనా చౌదరి
- గతంలో రాజ్యసభలో, మండలి బీసీలకు వాళ్లెందుకు ఇన్ని పదవులు ఇవ్వలేదో చెప్పాలి.
- చంద్రబాబుకు ఓడిపోయినప్పుడు వర్ల రామయ్య లాంటి వారు గుర్తుకు వస్తారు. గెలిస్తే సుజనా చౌదరి లాంటి వారు గుర్తుకు వస్తారు.
- మా జిల్లాల్లో తిరిగి మాపై ఎవరైనా వ్యతిరేకతతో మాట్లాడితే అప్పుడు పవన్ మాట్లాడితే బాగుంటుంది.
- అమావాస్యకో.. పౌర్ణమికో సెలబ్రిటీ పార్టీ నాయకుడిలా మేం రావడం లేదు. మేం ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటున్నాం.
- మాదే ప్రధాన పార్టీ. మేం ఎవరితోనూ పొత్తులకు వెళ్లం. మాతోనే ఎవరైనా పోత్తులకు వస్తారు అని పవన్ కళ్యాణ్‌ను చెప్పమనండి.
- అలా చెబితే ఆయన మాటలకు విలువ ఉంటుంది. అలా కాకుండా ఎందుకు సొల్లు కబుర్లు మాట్లాడం..?
175 స్థానాల్లో గెలుస్తాం
- అసలు వైఎస్సార్సీపీని ప్రజలు ఎందుకు కాదంటారు అనే దానికి సమాధానం చెప్పాలి
- 99 శాతం మేం ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై ప్రత్యేక దృష్టితో సేవ చేస్తున్నాం
- అందుకే మా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీని తలదన్ని మన విద్యా విధానం గురించి దేశం చర్చించుకుంటోంది.
- వచ్చే పదేళ్ళలో మన రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకున్న సంస్కరణల ఫలితాలు కన్పిస్తాయి
- మెడికల్ కాలేజీతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా జిల్లాకు ఒకటి వస్తుంది.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం.
- దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా పంటలకు మద్దతు ధర ప్రకటించాం.
- అందుకే 175 సీట్లు గెలుస్తాం అని స్పష్టంగా చెబుతున్నాం.
రాక్షసుల్లా యజ్ఞ భంగం
- ఉగాదికి కాదు. రేపటి నుంచే రాజధాని విశాఖకు రావాలని నా కోరిక.
- చాలా మంది దుష్టులు, దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారంతా రాక్షసుల్లా యజ్ఞ భంగం చేయాలని చూస్తారు.
- వాళ్లను తట్టుకుని బయట పడాలి. అందుకు కొంత టైమ్ కావాలి.