● అప్పన్నపేట రైతుల నిరసన
పెద్దపల్లిరూరల్: ‘నాకున్న ఇరవై గుంటలు బైపాస్ రోడ్డు పనుల కోసం పోయాయి. ఇదివరకు సుజ లాం పైపులైన్ కోసం కొంత పోయింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి’ అని అప్పన్నపేట గ్రా మానికి చెందిన రైతుల బత్తిని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులకు అవసరమైన భూములను తమకు చెప్పకుండానే లాక్కోవడం ఏమిటని ఆ గ్రామ రైతులు ప్రశ్నించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం రైతులు సమావేశమై మాట్లాడారు. మార్కెట్ ధరల ప్రకారం సొమ్ము చెల్లించిన తర్వాతే బైసాస్ పనులను చేపట్టాలని రైతులు రాజిరెడ్డి, రాజేశం, బ త్తిని రాజయ్య, లక్ష్మయ్య, రమేశ్, శ్రీనివాస్, రాయలింగు తదితరులు కోరారు. పెద్దకల్వల నుంచి అప్పన్నపేట వరకు బైపాస్ రోడ్డు పనులు చేపట్టిన ప్రభుత్వం.. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా తమ భూములు లాక్కోవడం సరికాదన్నారు. పెద్ద పల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు చొరవచూపి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులు రమేశ్, రాయలింగు, గట్టయ్య, వజ్రమ్మ, అయిలమ్మ, రాజయ్య, తేజకృష్ణ, రవీందర్, రాయగట్టు తదితరులు ఉన్నారు.


