ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 24 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ప్రతి వారం మాదిరిగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగ్గా రెండు చోట్ల ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ, ఏఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. సరిగ్గా పదిగంటలకు డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత ఫిర్యాదులు స్వీకరించారు. పన్నెండున్నర గంటలకు ఎస్పీ దామోదర్ తన చాంబర్‌లో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తంగా 24 ఫిర్యాదులను స్వీకరించి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ, ఏఎస్పీలు ఆదేశించారు. కార్యక్రమంలో డీజీఆర్బీ సీఐ కె.కుమార స్వామి, ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, అంబేడ్కర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 27 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో పరిపాలనాధికారి వి.సునీల్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 27 వినతులు స్వీకరించారు. మోంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని కోడిశ పంచాయితీ బిల్లగూడకు చెందిన అప్పన్న కోరాడు. కొంజరగూడ గ్రామస్తురాలు లలిత అంగన్‌వాడీ సెంటర్ మంజూరు చేయాలని, పొలంగూడ గ్రామస్తుడు రాజయ్య మేకల కొనుగోలుకు రుణం ఇప్పించాలని కోరారు. మండ పాఠశాల ఎండీఎం నిర్వాహకులు బియ్యం పాఠశాలకు సరఫరా చేయలని వినతి అందజేశారు. డిప్యూటీ ఈఓ రామ్మోహన్‌రావు, డీఈ నాగభూషణరావు, వ్యవసాయాధికారి వాహిని పాల్గొన్నారు.


