జగనన్న సీఎం కావాలని...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ శబరిమలలో అయ్యప్పకు రేగిడి మండలం లచ్చన్నవలస గ్రామానికి చెందిన అయ్యప్పదీక్ష ధారులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన 20 మంది భక్తులు 41 రోజుల కిందట అయ్యప్పదీక్ష ప్రారంభించారు. దీక్ష ముగియడంతో శబరిమల యాత్రకు వెళ్లిన వీరంతా అక్కడ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ఆలయానికి చేరుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అయ్యప్పను ప్రార్థించారు. –రేగిడి


