రేపటి నుంచి చెరకు క్రషింగ్
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో ఈ నెల 5 నుంచి చెరకు క్రషింగ్ ప్రారంభించనున్నట్టు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2025– 26 సీజన్‌లో మెట్రిక్ టన్ను చెరకు రూ. 3,360 లు మద్దతు ధరగా ప్రకటించామని వెల్లడించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది టన్నుకు రూ.209లు మద్దతు ధర పెంచినట్టు పేర్కొంది.రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నామని తెలిపి ంది. చెరకు నరికేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చామని వెల్లడించింది.
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంచాయతీ వెంకటరాజపురానికి చెందిన రైతు లు మర్రాపు ధనుంజయరావు, లక్ష్మునాయుడుకు చెందిన ధాన్యం రాశులను ఏనుగులు బుధవారం చిందరవందర చేశాయి. టార్పాలిన్లను కాళ్లతో కుమ్మి ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని, ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాల ని రైతులు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం చింతలబెలగాం, గవరమ్మపేట గ్రామాల నడుమ ఏనుగు లు సంచరిస్తున్నాయి.
సాలూరు: రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరికుమార్ సామాజిక మాధ్యమం వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారంటూ సాలూరులో నివసిస్తున్న పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన అధికార్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ కౌన్సిల ర్లు, నాయకులతో కలిసి హరిపై సాలూరు పట్టణ పోలీస్‌స్టేషన్లో సీఐ అప్పలనాయుడుకు బుధవారం ఫిర్యాదు చేశారు. 35 ఏళ్లు అయినా పెళ్లి కాలేదని, మగాడు కాదు.. మగతనం పనిచేయదు.. వీడు కొజ్జావాడు.. మీరు చెక్ చెసుకోవచ్చు.. ఇది వంద శాతం నిజం.. అంటూ హరికుమార్ తనపై ఎన్‌పీఎన్ న్యూస్ మన్యం, విజయనగరం, సన్నీ అందరివాడు మనందరివాడు, జై తెలుగుదేశం, సాలూరు, టీడీపీ ఉత్తరాంధ్ర విభాగం, సాలూరు–విజయనగరం యువకెరటాలు అనే గ్రూపుల్లో మెసేజ్‌లు పెడు తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి డ్రైవర్‌తో పాటు నాలుగు ఫోన్ నంబర్లతో తనను అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. నాగరాజు వెంట కౌన్సిలర్లు గిరిరఘు, సింగారపు ఈశ్వరరావు, గొర్లె వెంకటరమణ, నాయకు లు పిరిడి రామకృష్ణ,మజ్జి అప్పారావు పాల్గొన్నారు.
రేపటి నుంచి చెరకు క్రషింగ్
రేపటి నుంచి చెరకు క్రషింగ్


