మెనూ అమలు చేయకుంటే ఎలా?
గుమ్మలక్ష్మీపురం: విద్యార్థుల కోసం కేటాయించిన మెనూ అమలు చేయకుంటే వారి ఆరోగ్యాలెలా బాగుంటాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ నాయకులు టి.అఖిల్, హెచ్.సింహాచలం ప్రశ్నించారు. ఈమేరకు ఆదివారం వారు మండలంలోని టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఉదయం పూరి పెట్టాల్సి ఉన్నప్పటికీ కిచిడీ అంటూ అన్నం పెట్టారని, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ పెట్టాల్సి ఉన్నప్పటికీ వాటి స్థానంలో గుడ్డు కూరతో ముద్దగా ఉన్న అన్నం పెట్టారని..ఇలా మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారన్నారు. కావున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆశ్రమ పాఠశాలలో మెనూ అమలుపై దృష్టిసారించాలని, విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు.


