హెల్పింగ్ హ్యాండ్స్ పోస్టర్ ఆవిష్కరణ
పార్వతీపురం: ప్రభుత్వాస్పత్రుల్లో నిరాటంకంగా వైద్య సహాయం అందించేందుకు రూపొందించిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ ప్రత్యేక సేవా కార్యక్రమం పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే అమాయకులైన గిరిజనులకు వైద్యసేవలందేలా యువత, విద్యార్థులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులను స్వచ్ఛంద సేవలకు పిలుపునిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమం రూపొందించామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్‌లో సహాయకులుగా చేరాలనుకునే వారు తమ పేర్లను ఆస్పత్రివద్ద నమోదు చేసుకోవాలని కోరారు. రిజిస్ట్రేషన్ కోసం ఆర్.శ్యామలరావు (నోడల్ అధికారి) 83330 20050, కె.శ్యామలరావు,(ఆర్‌ఎంఓ) 99856 11002, డా.నాగశివజ్యోతి( సూపరింటెండెంట్) 96400 53245, జి.నాగభూషణరావు (డీసీహెచ్‌ఎస్) 98482 77311 నంబర్లను సంప్రదించాలని కోరారు.


