రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో విజయనగరం జిల్లా క్రీడాకారులు పతకాలు దక్కించుకున్నారు. ఈనెల 22,23 తేదీల్లో విశాఖలో జరిగిన సబ్‌జూనియర్స్, జూనియర్స్ పోటీల్లో గౌడ సాకేత్ 50 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్, 100 మీటర్స్ బట్టర్ ఫ్లై, 50 మీటర్స్ ఫ్రీ స్టైల్,100 మీటర్స్ ఫ్రీ స్టైల్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్‌తో పాటు 100 మీటర్స్ బ్రీస్ట్ స్ట్రోక్ లో సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నాడు. అంతేకాకుండా మరో స్విమ్మర్ లెంక గుణవంత్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్‌లలో రెండు గోల్డ్ మెడల్స్, 200 మీటర్స్ ఫ్రీ స్టైల్‌లో ఒక సిల్వర్ మెడల్, 50 మీటర్స్ బట్టర్ ఫ్లై , 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్‌లో బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సీహెచ్ వేణుగోపాలరావు, స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.ఆదిలింగం, కోచ్ శ్రీను అభినందించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరగబోయే సౌత్ జోన్ జాతీయ పోటీలకు హాజరుకానున్నారని తెలియజేశారు.


