వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో అంధకారంలోకి విద్యార్థుల భవి
నెల్లిమర్ల రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. ఊరూరా జరుగుతున్న ఈ కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. మండలంలోని మొయిద నారాయణపట్నం, ఆత్మారాముని అగ్రహారం ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు దవళ లక్ష్మణరావు, ఆదినారాయణ, తాతినాయుడు, శివ, శ్రీను, సూరినాయుడు, చిరంజీవి, సంతోష్ తదితరులు పాల్గొని, చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తీసుకుంటున్న దుర్మార్గపు నిర్ణయాలను వివరించారు. పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్) విధానంలో కళాశాలలు నడిపితే నిరుపేద విద్యార్థులకు వైద్యవిద్య దూరమై, విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందన్నారు. ప్రతిఒక్కరూ సంతకాలు చేసి విద్యార్థుల భవితను కాపాడాలని కోరారు.


