
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
విజయనగరం: చెస్‌అసోసియేషన్ ఆఫ్ విజయనగరం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు స్పందన లభించింది. రింగ్‌రోడ్‌లో ఉన్న ఫైర్ చెస్ స్కూల్లో అసోసియేషన్ కార్యదర్శి కేవీ జ్వాలాముఖి ఆధ్వర్యంలో అండర్–7,9,11,13 విభాగాలతో పాటు ఓపెన్ విభాగాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 80 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో రాజాంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీలను వి.వెంకటేష్, ధనలక్ష్మి, పద్మావతి, అర్చనలు పర్యవేక్షించారు.