సీతంపేట: మండలంలోని నాయకమ్మగూడలో ఆరు మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్టు దోనుబాయి పీహెచ్‌సీ వైద్యాధికారి భానుప్రతాప్ తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన బాలుడు జ్వరంతో అస్వస్థతకు గురై మృతిచెందడంతో వైద్య సిబ్బంది శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. 129 మందికి రక్తపూత పరీక్షలు చేశారు. మలేరియా పాజిటివ్ వచ్చినవారికి అవసరమైన మందులు అందజేసినట్టు వైద్యాధికారి తెలిపారు.
ఏనుగుల గుంపు విధ్వంసం
జియ్యమ్మవలస రూరల్: గరుగుబిల్లి మండలం నందివానివలస, సుంకి, తోటపల్లి గ్రామాల మధ్య నాలుగురోజులుగా సంచరిస్తున్న అటవీ ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి కుదమ పంచాయతీ గౌరీపురం చెరకు, వరి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించాయి. పంటను మొత్తం నాశనం చేయడంతో రైతులు యోగి రెడ్డి కై లాసరావు, శంబంగి లక్ష్మనాయుడు, అంబటి రాంబాబు, దత్తి వెంకటనాయుడు, రమేష్, తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు పంటను పరిశీలించి పరిహారం అందజేయాలని కోరారు. ఏనుగుల సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
13న సీజీఆర్‌ఎఫ్
విజయనగరం ఫోర్ట్: విజయనగరంలోని దోమల మందిరం వద్ద ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో ఈ నెల 13న విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) నిర్వహించనున్నట్టు ఎస్‌ఈ మువ్వలక్ష్మణరావు తెలిపారు. సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజ్ హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ జారీలో అలసత్వం, మీటరు, సర్వీస్ లోపాలు, రీ కనెక్షన్ సమ స్యలు, కాలిపోయిన మీటరు, బిల్లుల్లో తప్పులు, కనెక్షన్ మార్పు వంటి అంశాలపై సమావేశం ఉంటుందని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్ కార్యాలయానికి లఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

నాయకమ్మగూడలో మలేరియా