స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం

May 10 2025 8:16 AM | Updated on May 10 2025 8:16 AM

స్వప్

స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం

విజయనగరం టౌన్‌: శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో భాగంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ నెల 10, 11 తేదీల్లో ఏలూరులోని మహాలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మంటపంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలను అందజేయనున్నారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, సేవాతత్పరురాలు రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం అందజేయనున్నట్లు సంస్ధ జాతీయ కన్వీనర్‌ కొల్లి రమావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఇద్దరు నిందితులపై కేసు నమోదు

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): సారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన దాడిలో స్వాధీనం చేసుకున్న సారా, ద్విచక్రవాహనాన్ని కురుపాంలోని తన కార్యాలయంలో చూపించారు. సారా అక్రమ అమ్మకాలు నిరోధించే కార్యక్రమంలో భాగంగా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ద్విచక్ర వాహనంపై సారాను అక్రమంగా తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి దగ్గర 80 లీటర్ల సారాతో పాటు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురంటౌన్‌: సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ పరీక్షలు రాసే అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి ఇ.అప్పన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్‌ పరీక్ష ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిగ్రీ మార్కుల లిస్ట్‌, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టెట్‌ మార్కుల లిస్టు జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ ఫొటోలు 2, దరఖాస్తులతో జత చేయాలని సూచించారు.

నల్లబెల్లం పట్టివేత

సీతంపేట: మండల కేంద్రంలో ఎస్‌టీఎఫ్‌ మొబైల్‌ టీమ్‌ మురళీధర్‌, ఎస్సై హనుమాన్‌నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం సీతంపేటలో సారాకు వినియోగిస్తున్న నల్లం బెల్లాన్ని పట్టుకున్నారు. స్థానికంగా ఓ గోదాంలో నిల్వ ఉంచిన వందకు పైగా బెల్లం చక్కీలను సీజ్‌ చేసినట్లు సమాచారం. బెల్లం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

జ్వరంతో బాలుడి మృతి

సీతంపేట: మండలంలోని నాయకమ్మగూడ గ్రామానికి చెందిన ఆరిక మోహిత్‌ (7) అనే బాలుడు జ్వరంతో బాధపడుతూ గురువారం సాయంత్రం మృతిచెందాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలుడికి మందులు వాడినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు దోనుబాయి పీహెచ్‌సీకి గురువారం తీసుకువెళ్లారు.అక్కడ వైద్యసేవలందించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యాధికారి భానుప్రతాప్‌ స్థానిక ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేయగా ఇక్కడికి తీసుకువచ్చేసరికే మృతిచెందినట్లు సూపరెంటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు.

పుస్తక హుండీకి విశేష స్పందన

విజయనగరం టౌన్‌: జిల్లా గ్రంథాలయ సేవా సంఘం నిర్వహిస్తున్న పుస్తక హుండీ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోందని సంఘం వ్యవస్ధాపకుడు అబ్దుల్‌ రవూఫ్‌, ఉపాధ్యక్షుడు కె.దయానంద్‌లు తెలిపారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ దిమిలి అచ్యుతరావు తన ఇంట్లో ఉన్న వివిధ రకాల పుస్తకాలు ఇతరులకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో తమను సంప్రదించగా ఆయన ఇంటికి వెళ్లి పుస్తకాలను స్వీకరించామ న్నారు. పుస్తక హుండీ నిరంతర ప్రక్రియ అని, ఇలా సేకరించిన పుస్తకాలను వివిధ గ్రంథాలయాలు, విద్యార్థులకు అందజేస్త్నునామన్నారు. సెల్‌ ప్రభావంతో అన్ని వయసుల వారు పుస్తక పఠనానికి దూరమవుతున్న నేపథ్యంలో మళ్లీ పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించి గ్రంథాలయాలవైపు నడిపించేలా సంఘం నిరంతరం కృషిచేస్తుందని చెప్పారు.

స్వప్న హైందవికి  మాతృదేవోభవ పురస్కారం1
1/2

స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం

స్వప్న హైందవికి  మాతృదేవోభవ పురస్కారం2
2/2

స్వప్న హైందవికి మాతృదేవోభవ పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement