విజయనగరం పూల్‌బాగ్: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పేదకుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాల ల్లో 25 శాతం సీట్లు కేటాయించినట్టు కలెక్టర్ ఎ.సూర్యకుమారి తెలిపారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12(సి) ద్వారా 5 నుంచి 6 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు www.cre.ap.gov.in/QTE వెబ్‌సైట్‌లో గానీ, గ్రామ /వార్డు సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 22 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీనిపై ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్ 14417ను సంప్రదించాలన్నారు.