
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నాన్‌తాడును అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. కేసు విచారణలో సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించారు. నాగరాజును విచారించగా చైన్ స్నాచింగ్‌ను ఒప్పుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద సుమారుగా రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాగరాజు డీజే ఆపరేటర్‌గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్‌పై భర్తతో కలిసి వెవెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెవెళ్లిపోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్‌ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
రేపు జిల్లా స్విమ్మింగ్ జట్టు ఎంపికలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్‌లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వాటర్ పోలో జట్టు ఎంపికలు నిర్వహిస్తామన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల ఛాంపియన్‌షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వతేది సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో తమ ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు.

అంతరాష్ట్ర దొంగ అరెస్టు