
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు
గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు.