
విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు స్పెల్‌బీ, గణితంలో ప్రజ్ఞాపాటవాలు పెంచేందుకు మ్యాథ్స్‌బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’కి అభినందనలు. మా పాఠశాలలోని వివిధ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు ఏటా స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి హాజరవుతున్నారు.
– జి.శ్రీనివాస్, డైరెక్టర్, విజేత ఐఐటీ ఫౌండేషన్ స్కూల్
విద్యార్థులకు ఎంతో ప్రయోజనం
‘సాక్షి’ నిర్వహిస్తున్న స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. ఇంగ్లిష్‌లో వకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. గణితంలో లాజికల్ థింకింగ్‌తోపాటు పోటీతత్వం పెంపొందించడంలో మ్యాథ్స్‌బీ దోహదం చేస్తుంది. గతేడాది మా స్కూల్ విద్యార్థులు స్కూల్ చాంపియన్‌గా నిలిచారు.
– జి.సుహాసిని, ప్రిన్సిపాల్,
విజేత ఐఐటీ ఫౌండేషన్ స్కూల్, గుంటూరు
స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీలపై ఆసక్తి
‘సాక్షి’ స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీపై అమితాసక్తి ఉంది. నేను ఒకటో తరగతి నుంచి ఏటా పాఠశాల, జిల్లాస్థాయిలో జరిగే రెండు కాంపిటిషన్లకు హాజరవుతున్నాను. స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ రెండు పరీక్షల్లోనూ ప్రతిభ చూపి బహుమతులు గెలుపొందుతున్నాను.
– జి.అషీరా, 6వ తరగతి, నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్
మ్యాథ్స్‌బీ ఆసక్తికరంగా ఉంది
మ్యాథ్స్‌బీ నిర్వహించిన తీరు బాగుంది. గణిత ప్రశ్నపత్రంలో మల్టీపుల్ ఛాయిస్ విధానంలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకునే ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. మున్ముందు పోటీపరీక్షలకు హాజరవ్వడానికి ఉత్సాహమిచ్చింది.
– కె.దక్షదీప్ రెడ్డి, 7వ తరగతి, విజేత ఐఐటీ స్కూల్
●


