
తనిఖీల్లో పాల్గొన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
చిలకలూరిపేట టౌన్: ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి భవనాలు, గోదాములు నిర్మించిన వాటిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామంలోని మిట్టపల్లి పొగాకు గోదాముతో పాటు పట్టణంలోని సుభాని నగర్, గాంధీపేట, పాతసంత తదితర ప్రాంతాల్లోని హాస్పిటల్, స్కూల్, అపార్ట్‌మెంట్లను క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినట్లు నిర్ధారించిన అధికారుల బృందం ఆయా భవనాల యజమానులు ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్ని సైతం సక్రమంగా కట్టడం లేదని తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీహరిరావు, జీఎస్‌టీ అధికారి మల్లిఖార్జునరెడ్డి, కార్మికశాఖ సహాయ అధికారి కోటేశ్వరరావులు పాల్గొన్నారు.
నిమ్మకాయల ధరలు
తెనాలిటౌన్: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.8,000 వరకు పలికింది.
