మహిళల ఽధైర్యం జగనన్నే!

- - Sakshi

● వైఎస్సార్‌ ఆసరా ద్వారా అప్పుల్లేని జీవితాలు ● చేయూత ద్వారా సొంతంగా వ్యాపారాలు ● మహిళా సాధికారత సారఽథి సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ● మంత్రి విడదల రజిని

ఆదివారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2023

ఇఫ్తార్‌ సహర్‌

(ఆది) (సోమ)

నరసరావుపేట 6:27 4:49

గుంటూరు 6:25 4:51

బాపట్ల 6:25 4:51

చిలకలూరిపేట: రాష్ట్రంలో మహిళల ఽధైర్యం జగనన్నే అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. వైఎస్సార్‌ ఆసరా పల్నాడు జిల్లాస్థాయి కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్‌ హాలు లో శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి విడదల రజిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ వైఎస్సార్‌ ఆసరా అనేది ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమమని, మహిళలందరి డ్వాక్రా రుణాలను మాఫీ చేసే గొప్ప పథకం ఇదేనని గుర్తు చేశారు. నాలుగు విడతల్లో రుణాలు మాఫీ చేస్తానని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మూడో ఏడాది రుణమాఫీ నగదును మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారని చెప్పారు.

ఒక్క పల్నాడు జిల్లాకే మూడో విడత ఆసరా కింద 5,851 సంఘాలకు సంబంధించిన 55,952 మంది సభ్యులకు రూ.45.39 కోట్లు నిధులను జగనన్న విడుదల చేశారని వెల్లడించారు. మూడేళ్ల కాలానికి రూ.191 కోట్లను అందించిన ఘనత జగనన్నదే అన్నారు. రాష్ట్రంలో మహిళలు వైఎస్సార్‌ ఆసరా ద్వారా అప్పులు తీర్చుకోగలుతున్నారన్నా రు. వైఎస్సార్‌ చేయూత లాంటి పథకాల ద్వారా సొంతగా వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. ఇలా రాష్ట్రంలో మహిళలకు నిజమైన స్వాతంత్య్రాన్ని జగనన్న తీసుకువచ్చారని వెల్లడించారు. ఇలాంటి జగనన్నకు మహిళలంతా ఎప్పుడు తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి నమ్మక ద్రోహం చేశారని మండి పడ్డారు. గత పాలనలో డ్వాక్రా మహిళలకు జరిగిన అన్యాయం చూశామని, జగనన్న ప్రభుత్వంలో మహిళలకు జరుగుతున్న మేలు చూస్తున్నామని వెల్లడించారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్ట్టీనా మాట్లాడుతూ జగనన్న పాలనలో రాష్ట్రంలో ప్రతిమహిళా ఆనందంగా జీవిస్తోందని చెప్పారు.పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలను మహిళలు అందిపుచ్చుకుని అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ బాలునాయక్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, వైస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

సంతోషంగా మహిళలు:

జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా

మహిళలకు రూ.2.25 లక్షల కోట్ల లబ్ధి

చిలకలూరిపేట: వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలోనే ఏకంగా రూ.2.25 లక్షల కోట్ల విలువైన సంక్షేమాన్ని మహిళలకు అందించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పేదలకు రూ.2.25 లక్షల కోట్ల విలువైన లబ్ధిని చేకూరిస్తే, అందులో రూ.1.41 లక్షల కోట్లు నేరుగా డీబీటీ పద్ధతిలో మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత లబ్ధి చేకూర్చలేదని చెప్పారు. ఈ సందర్భంగా నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ హెనీ క్రిస్టినా, పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు.

Read latest Palnadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top