
వినుకొండ(నూజెండ్ల): ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు చంద్రబాబు, లోకేష్ కలలు కంటున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మూడు ఎమ్మెల్సీలు గెలవగానే గ్రామాల్లో ఫ్లెక్సీలు చింపడం, గొడవలను ప్రేరేపించడం, అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలుచేస్తున్న ఘనత తమదే అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహాయసహకారాలతో వినుకొండ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పా రు. స్థానిక మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గ్రామాల్లో ఫ్లెక్సీలు చించడం, గొడవలు సృష్టించడం, తిరునాళ్లకు ప్రభల విషయంలో అల్లర్లు చేయడం, అభివృద్ధి పనులపై కోర్టు ల్లో కేసులు వేయడం తప్ప వినుకొండ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నా రు. తమ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా తమ హయాంలోనే నిధులు మంజూరైనట్లు చెప్పుకోవడం జీవీ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. యార్డు చైర్మన్ బి.వెంకటేశ్వర్లుయాదవ్, ఈపూరు మండల కన్వీనర్ కె.దేవరాజ్, నూజెండ్ల కన్వీనర్ ఎన్.నాగిరెడ్డి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు జి.స్వెనోమ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు