
మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి అంబటి రాంబాబు
మంత్రి అంబటి రాంబాబు
నకరికల్లు: ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకున్నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ ఆసరా కింద నగదు పంపిణీ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నకరికల్లు మండలంలోని 1053 సంఘాలకు రూ.8.49కోట్ల లబ్ధి చేకూరిందని అన్నారు. వైఎస్సార్ ఆసరా నాలుగు విడతల్లో కలిపి సుమారు రూ.25వేల కోట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం మంజూరు చేశారని అన్నారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు 30లక్షల ఇళ్లస్థలాలు మంజూరు చేసి చరిత్ర సృష్టించామని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 17 గెలిస్తే టీడీపీ కేవలం నాలుగు మాత్రమే గెలిచిందని, దీన్ని బట్టి ఎవరికి ప్రజల అండదండలు ఉన్నాయో స్పష్టమైందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బి.బాలూనాయక్, జెడ్పీటీసి సభ్యుడు జూనెబోయిన హరీష్, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్ పరసా అంజమ్మ, ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ ఎస్.సురేష్, ఏపీఎం సునీత, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.