
స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్
సత్తెనపల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. సత్తెనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, రఘురాంనగర్లోని బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన సందర్శించారు. సిలబస్ ఎక్కడ వరకు పూర్తయింది, నోట్ పుస్తకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. సత్తెనపల్లి ఆర్డీవో బీఎల్ఎన్ రాజకుమారి, తహసీల్దార్ కె.నగేష్, మండల విద్యాశాఖ అధికారి ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.