
నవరత్నాలలో భాగమైన వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత చెల్లింపులు శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఆసరా సొమ్మును మహిళలు నచ్చిన విధంగా వినియోగించుకొనే వెసులుబాటు ఉంది. ఉత్సాహం ఉన్న మహిళలకు జీవనోపాధులు కల్పించేందుకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోంది. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిని మహిళలు వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించాలి.
– శివశంకర్ లోతేటి, జిల్లా కలెక్టర్, పల్నాడు