
పిడుగు పడి మృతి చెందిన దేవేంద్ర
బొల్లాపల్లి: మిరప కోతకు వచ్చి పిడుగుపాటుకు గురై ఓ వలస కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని సరికొండపాలెం తండా సమీపంలోని పొలాల్లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా కౌథాలయం మండలం వల్లూరు గ్రామం నుంచి సుమారు 35 కుటుంబాలు మిరప కోతలకు మండలంలోని సరికొండపాలెం తండా బతుకుతెరువుకు వలస వచ్చారు. అందులో వడ్డె దేవేంద్ర(33) కోతకు వెళ్లాడు. ఉరుములు మెరుపులతో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య నిర్మల మరో కూలీ అక్కడే సృహ కోల్పోయారు. మృతుడికి భార్య, ఇరువురు చిన్నారులు ఉన్నారు.