
వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ లోతేటి శివశంకర్
సత్తెనపల్లి: జల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు. నీటి పరిరక్షణ అవగాహనపై గోడ పత్రికలను శుక్రవారం నరసరావుపేటలో ఆవిష్కరించారు. భారత ప్రభుత్వం, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి గుంటూరు జిల్లా, జాతీయ జలశక్తి మిషన్, ఎడ్యుకేట్ ద సొసైటీ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లోతేటి శివశంకర్ మాట్లాడుతూ నీటిని వృథా చేయకూడదని, నీటిని మనం మాత్రమే వృథా చేయకూడదు అనే విధానాన్ని వీడి సమీపంలోని వారితో కూడా నీటి ప్రాముఖ్యతను వివరించి నీటి నిల్వలు పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించాలని సూచించారు. క్యాచ్ ద రెయిన్ ప్రాజెక్ట్ ఫేస్ 3వ కార్యక్రమానికి విద్యార్థులు, యువజన సంఘాలు సహకారం అవసరమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎడ్యుకేట్ ద సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ షేక్ అన్సారీ ఉన్నారు.