లక్ష్యానికి మించి ‘ఉపాధి’ | - | Sakshi
Sakshi News home page

లక్ష్యానికి మించి ‘ఉపాధి’

Mar 24 2023 6:12 AM | Updated on Mar 24 2023 6:12 AM

చిలువూరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌) - Sakshi

చిలువూరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ఉపాధిహామీ పనిదినాలు లక్ష్యానికి మించి జరుగుతున్నాయి. ఈ ఏడాది లక్ష్యం 27 లక్షల పనిదినాలుగా నిర్ణయించగా ఇప్పటికే 2,914 లక్షల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఈ నెలాఖరుకు 30 లక్షల పనిదినాలు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 10,794 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 97.99 శాతం, 2019–20లో 86.15 శాతం, 2020–21లో వంద శాతం, 2021–22లో 101.26 శాతం పనులు పూర్తికాగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 107.94 శాతం పూర్తి అయ్యింది. నెలాఖరుకు ఇదిమరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి గాను రూ.62 కోట్ల వేతనంగా చెల్లించారు. ప్రాధాన్యతా భవనాల నిర్మాణం కోసం రూ.11.13 కోట్లు, ప్రాధాన్యతేతర భవనాల నిర్మాణం కోసం రూ.9.95 కోట్లు, ఇతర విభాగాల పనుల కోసం రూ.17.55 కోట్లు చెల్లించారు. జగనన్న కాలనీల్లో లెవలింగ్‌ కోసం రూ.32 కోట్లు చెల్లించడం జరిగింది. ఈ విధంగా మొత్తం రూ.70.63 కోట్లు చెల్లించగా మరో రూ.17.61 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రూ.9.99 కోట్లకు ప్రభుత్వ ఆమోదం లభించడంతో ఈ నెలఖరులోపు చెల్లించే అవకాశం ఉంది. మిగిలిన రూ.7.62 కోట్లు ఏప్రిల్‌లో చెల్లింపులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు చెల్లించడం డ్వామా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

జిల్లాలో 1.25 లక్షల జాబ్‌కార్డులు..

జిల్లాలో 277 గ్రామ పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 1.25 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 2.12 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఇందులో యాక్టివ్‌గా ఉన్న జాబ్‌కార్డులు 84 లక్షలు కాగా 1.43 లక్షల మంది కార్మికులు ఉపాధిహామీ పనులకు హాజరు అవుతున్నారు. ఇందులో 46 వేలమంది ఎస్సీ వర్గానికి చెందినవారు కాగా, మూడువేల మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రతి కుటుంబానికి సగటున 41.31 రోజులు పని కల్పించారు. మహిళలకు ఎక్కువగా 58.19 రోజులు పని కల్పించారు. సగటున ఒక్కొక్కరికి రోజుకు రూ. 212.70 ఉపాధిహామీ కింద అందింది. 802 కుటుంబాలు వంద రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్నాయి. ఆయా పనులకు సంబంధించిన సామాజిక తనిఖీలు కూడా ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ప్రతి రోజూ ఒక మండలాన్ని ఎంచుకుని ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు డ్వామా ప్రాజెక్టు అధికారి ఎం.యుగంధర్‌కుమార్‌ ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.

గుంటూరు జిల్లాలో 30 లక్షల పని దినాలు బిల్లుల చెల్లింపులోనూ ముందంజ ఇప్పటికే రూ.70.63 కోట్లు చెల్లింపులు ఈ నెలాఖరులోపు మరో రూ.10కోట్లు ప్రాధాన్యత భవనాలకు రూ.11. 13 కోట్లు ఇతర భవనాలకు రూ.9.95 కోట్లు జగనన్న కాలనీల లెవలింగ్‌కు రూ.32 కోట్లు చెల్లింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement