శ్రీకాకుళం కల్చరల్: స్థానిక 80 ఫీట్ రోడ్‌లో సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో వారాంతపు సేంద్రియ సంత ఆదివారం నిర్వహించారు. సిక్కోలు హరిత మహోత్సవం సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులను ఒక వేదికపైకి తీసుకొచ్చి, పండించిన పంటలను మధ్యవర్తులు లేకుండా ప్రజలకు అందించడంతో రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుతున్నాయని నిర్వాహకులు అన్నారు. ఈ సంత ప్రతినెలా రెండో ఆదివారం, నాలుగో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. సంతలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారని, అలాగే వివిధ రకాల విత్తనాలు, పండ్లు, మొక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచారన్నారు.


