మైనింగ్‌ తవ్వకాలపై రాజకీయ సెగ! | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ తవ్వకాలపై రాజకీయ సెగ!

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

మైనింగ్‌ తవ్వకాలపై రాజకీయ సెగ! ● మారుతున్న సమీకరణలు

రాయగడ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని కాసీపూర్‌ సమితి సిజిమాలి మైనింగ్‌ తవ్వకాలకు సంబంధించి వేదంత కంపెనీకి అనుమతులు ఇచ్చి్‌ంది. దీ.ంతో ఆ ప్రాంతంలొ బాక్సయిట్‌ నిక్షేపాలను తవ్వేందుకు రహదారి నిర్మాణంలో భాగంగా తలెత్తిన వివాదంతో రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోడ్డు నిర్మించేందుకు ఇటు జిల్లా యంత్రాంగం పట్టుబడుతుండగా స్థానికులు తమ భూమిని కాపాడుకోవడానికి ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రజలకు మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు కాసీపూర్‌లోని ప్రభావిత గ్రామాలో విస్తృతంగా పర్యటించి తమ సానుభూతిని గ్రామస్తులకు తెలపడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతున్నారు. మరో వైపు పోలీసుల దురుసు ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలొ శుక్రవారం రాష్ట్ర పీసీసీ అధినేత భక్తచర ణ్‌ దాస్‌ ఆదేశాను సారం 13 మందితో కూడిన కాంగ్రెస్‌ సభ్యుల బృందం కంటమాల్‌ గ్రామంలో పర్యటించింది. కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర్‌ ఉల క నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు తారాప్రసాద్‌ బాహిని పతి, సురేంద్ర రౌత్రాయ్‌, మీనాక్షి బాహిని పతి, ఎమ్మెల్యే రామచంద్ర కడమ్‌, రాయగడ ఎంఎల్‌ఏ, డీసీసీ అధ్యక్షుడు అప్పలస్వామి కడ్రక, గుణుపూర్‌ ఎంఎల్‌ఏ సత్యజీత్‌ గొమాంగో, మాజీ ఎంపి యశ్వంత్‌ నారాయన్‌ సింగ్‌ లగురి, మాజీ ఎంఎల్‌ఏ భజ్‌బల్‌ మాఝి, రత్నమణి ఉలక తదితర సీనియర్‌ నాయకులతో కూడిన బృందం గ్రామంలో పర్యటించి స్థానికుల తో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒక నివేదికను పీసీ అధ్యక్షుడికి సమర్పించనున్నారు.

ఏది ఏమైనప్పటికీ కంటమాల్‌లొ చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయనడంలో ఏమాత్రం అతశయోక్తి కాదు.

Advertisement
 
Advertisement
Advertisement