మల్కన్‌గిరి: రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒడియా భాషా పక్షోత్సవంలో భాగంగా శుక్రవారం ‘రండి పుస్తకం కొనుగోలు చేద్దాం’ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సోమనా థ్ ప్రధాన్, వేద్బర్ ప్రధాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ మాట్లాడుతూ పుస్తకాలు సంస్కృతి సంప్రదా యాలకు ప్రతిబింబమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దాశరథి సరాబు, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, డీఐపీఆర్‌ఓ ప్రమిళ మాఝి పాల్గొన్నారు.
పర్లాకిమిడి: ఒడిషా పక్షోత్సవాలు సంధర్బంగా పురపాలక సంఘం పర్లాకిమిడి పరిధిలోని పలువురు లోకనృత్య కళాకారులను శుక్రవారం మున్సిపల్ కాన్ఫరెన్సు హాలులో ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలరు బబునా బెహరా మాట్లాడుతూ పర్లాకిమిడి మహారాజుల కాలం నుంచి రంగస్థల నాటికలు, కవులు, సంగీత కళాకారులకు ఆదరణ వుండేదని, ఇప్పుడు స్థానిక కళాకారులను గౌరవించడం హార్షనీయమన్నారు. అనంతరం రంగస్థల నటులు దేవేంద్ర దాస్, లోక సంగీత దర్శకులు రఘునాథ పాత్రో, రంగస్థల నాటకం దర్శకులు నృసింహాచరణ్ పట్నాయిక్, కూచిపూడి, భరత నాట్యం మాస్టారు వి.హిమగిరి, కర్ర,కత్తిసాము నిపుణుడు బెబర్తావీధికి చెందిన త్రిపతి పాత్రోలను సన్మానించారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, వైస్ చైర్మన్ లెంకమధు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్, కౌన్సిలర్లు బాలకృష్ణపాత్రో, నారాయణ బెహరా తదితరులు పాల్గొన్నారు.
ఆహ్వాన నాటిక పోటీలు
ప్రారంభం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీ ముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో పీకే ఎంటర్‌టైన్మెంట్ నిర్వహణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాలుగో ఆహ్వాన నాటిక పోటీలు బాపూజీ కళామందిర్‌లో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ అకాడమీ రచయిత్రి, దర్శకురాలు పెమ్మరాజు పూర్ణిమ ఆధ్వర్యంలో ‘సీ్త్ర మాత్రే నమః’ నాటిక ఆద్యంతం అలరించింది. ప్రతి కుటుంబాన్ని నడిపించి, గెలిపించే సీ్త్రని కూడా సీ్త్ర మాత్రే నమః అని పూజించాలనే సందేశంతో ప్రదర్శన సాగింది. పెందుర్తికి చెందిన నటరాజ డ్రామాటిక్ అసోసియేషన్ బి.శెట్టి శేఖర్ దర్శకత్వంలో చందు తులసి రచనలో ‘నీళ్లు– నీళ్లు‘ నాటికలో ప్రస్తుత కాలంలో గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే అవసరమని పేర్కొంటూ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆహూతులను అలరించింది. కార్యక్రమంలో కేతిరెడ్డి రాజేశ్వరి, నిక్కు హరిసత్యనారాయణ, పొగిరి సత్యం, పూజారి మన్మధరావు, ఉంగటి రమణమూర్తి, పాత్రుని పాపారావు, సనపల అన్నాజిరావు, పొగిరి సుగుణాకరరావు, నల్లి ధర్మారావు, బలివాడ శ్రీనివాసరావు, కీర్తి పాల్గొన్నారు.
రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన నాగవరపు వీరబాబు(39) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరబాబు తల్లి చనిపోయినప్పటి నుంచి మానసిక ఆవేదన చెందుతూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు రణస్థలం సీహెచ్‌సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వీరబాబుకు భార్య దుర్గ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


