మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని క్రీడా కాంప్లెక్స్, వసతి గృహాన్ని శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ సందర్శించారు. జిల్లాలో క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం, యువకుల ప్రతిభలను వెలుగులోకి తీసుకురావడం కోసం జిల్లా పరిపాలన యంత్రాంగి చర్యలు చేపట్టిందన్నారు. ఈ సందర్భగా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ క్రీడాకారులకు సంబంధించి వసతుల అబివృద్ధి, రాబోయే రోజుల్లో జరగనున్న సీఎం ట్రోఫీకి ఏర్పాట్లను పరిశీలించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని వివిధ విభాగాలను సందర్శించారు. క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు అథ్లెట్లకు మెరుగైన శిక్షణ కోసం ట్రాక్ స్థితిని పరిశీలించి.. దాని సంరక్షణతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ సమితుల్లో ఉన్న ఇండోర్ స్టేడియాలను సక్రమంగా నిర్వహిస్తూ ఎల్లప్పుడు క్రీడాకారులకు ఉపయోగపడేలా ఉంచాలని జిల్లా క్రీడాధికారికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచేందుకు గోడ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను మల్కన్‌గిరిలో ఘనంగా నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించా రు. అలానే హస్టల్‌లో ఉంటున్న క్రీడాకారుల సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారులు ఉన్నారు.


