పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ గోయిబడి ఏజెన్సీలో గురువారం తెల్లవారుజామున సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాకేష్ కుమార్ సాహు తన బృందంతో జరిపిన దాడుల్లో 17 సంచుల్లో గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో దాచిన 510 కిల్లోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్.డి.పి.ఓ రాకేష్ సాహు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో రూ.50 లక్షలు ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఆర్.ఉదయగిరి పోలీసు ష్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని సబ్ డివిజనల్ పోలీసు అధికారి తెలియజేశారు.


