పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్ ఓపెన్ ఆడిటోరియంలో గురువారం సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల విముక్తిపై ఒక కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ నోడల్ అధికారి డాక్టర్ సన్యాసి బెహరా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆదర్శ పోలీసు స్టేషన్ అధికారి ప్రశాంత భూపతి, సబ్‌డివిజనల్ పోలీసుఅధికారి మాధవాన ంద నాయక్, గురండి హెల్త్ విస్తరణాధికారి మమతా పాఢి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, డీన్ ఎస్పీ నందా తదితరులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎస్‌డీపీఓ మాధవానంద నాయక్ సూచించారు. అలాగే సైబర్ నైరాలు, ఇతర ఆర్థిక మోసాలపై పర్లాకిమిడి ఆదర్శ పోలీసు స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేయాలని, దీనికై ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశామని ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. కార్యక్రమంలో బరంపురం విశ్వవిద్యాలయం, విక్రందేవ్ వర్సిటీ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.


