పర్లాకిమిడి: గుసాని సమితి కత్తలకవిటిలో మాశీతాలయి (జడ్డిమా) గ్రామదేవత నూతన మందిర నిర్మాణం ప్రతిష్టాపన మహోత్సవాలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు మందిరానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పూరీ పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన అమ్మవారికి ప్రాణపతిష్ట, పూర్ణాహుతి, యజ్ఞాలు నిర్వహించి బుధవారం రెండుగంటల సమయంలో గుడి తలుపులు తెరిచి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కత్తలకవిటి గ్రామకమిటీ, తమిళనాడుకు చెందిన బ్రాహ్మణులు విచ్చేసి మంత్రోచ్ఛరణ చేశారు.


