జయపురం: జనగణన దేశ ప్రగతికి పునాది అని జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అర్చిత మిత్తల్ (ఐపీఎస్) అన్నారు. ప్రతి పౌరుడు తన పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదివారం స్థానిక స్వచ్ఛంద సంస్థ సోషల్ ఎన్విరోన్‌మెంటల్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్(సీవా) ఆధ్వర్యంలో నిర్వహించబడిన సెన్షస్ 2026 అవగాహనపై సైకిల్‌ని నిర్వహించారు. చారిత్రాత్మక రాజనగర్ పేలస్ నుంచి బయలు దేరిన ర్యాలీని పచ్చ జెడా ఊపి మిత్తల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించిన జనగణనకు ప్రజలు సహకరించాలన్నారు. సీవా మహిళా విభాగ అధ్యక్షురాలు విజయలక్ష్మీ పాణిగ్రహి మాట్లాడుతూ.. ఇంటికి సంబంధించిన కచ్చితమైన వివరాలు అందించటంలో మహిళల పాత్ర ముఖ్యమైనదన్నారు. కార్యక్రమంలోజయపురం బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్., సీవా అధ్యక్షులు అజయ కుమార్ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్ కుమార్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


