కోవిడ్‌ కలవరం!

- - Sakshi

సినీ ప్రముఖులకు సత్కారం

8లోu

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 సంక్రమణ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 17 కొత్త క్రియాశీల(యాక్టివ్‌) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు సమగ్రంగా 73కి చేరాయి. గత 24 గంటల్లో పలు చోట్ల 5,647 నమూనాలు పరీక్షించారు. అయితే కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు తాజా నమోదు పట్ల ఆందోళన చెందాల్సిందేమీ లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ నిరంజన్‌ మిశ్రా శుక్రవారం ప్రకటించారు. హెచ్‌3 ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు తారసపడితే కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్‌–19 నిర్థారణ పరీక్షలు పుంజుకోవడంతో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గత 134 రోజుల్లో ఇవే అత్యధిక కేసులని, అయితే ఈ వ్యవధిలో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరడం, మృతుల సంఖ్య పెరగడం వంటి దాఖలాలు లేనట్లు స్పష్టంచేశారు. గురువారం 5,647 నమూనాలు పరీక్షించామని, ఈ విశ్లేషణలో భయపడాల్సిన పరిస్థితులు లేనట్లు తేలిందని ప్రకటించారు. కోవిడ్‌ కేసులు ఒడిశాలో మాత్రమే కాకుండా దేశమంతటా నమోదవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అదుపులో ఉందని నిరంజన్‌ మిశ్రా తెలిపారు.

జాగ్రత్తలు పాటించాలి..

మరోవైపు అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, కోవిడ్‌–19 రోగులను గుర్తించడంలో పరీక్షలు నిర్వహించడం, వైద్య, చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచడం తదితర కార్యాచరణ కోసం ఆరోగ్యశాఖ అన్ని జిల్లాలను ఆదేశించింది. ఇన్‌ఫ్లూయెంజా, జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించడం, చేతులు తరచు కడుక్కోవడం, బహిరంగంగా ఉమ్మడం నివారించి కోవిడ్‌–19 మార్గదర్శకాలను క్రమం తప్పకుండా పాటించాలని అభ్యర్థించింది. దేశంలోని కోవిడ్‌–19 పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఇటీవల న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య డైరెక్టర్లతో సమావేశమయ్యారు.

24 గంటల్లో 17 కొత్త కేసులు నమోదు

భయాందోళన వద్ద: ఆరోగ్యశాఖ డైరెక్టర్‌

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top