
మామిడి సేకరణ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు ఇది ఉపయోగకరం. ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్మాణాలకు 75శాతం రాయితీ అందిస్తుంది. ఒక్క మామిడి కాకుండా ఇతరత్రా ఉద్యానవన పంటలను కూడా విక్రయించుకోవచ్చు. రైతులు పండించిన పంటను ఈ కేంద్రాలకు తీసుకువచ్చి అమ్మకాలు చేసుకోవచ్చు. జిల్లాలో మొత్తం 23 మామిడి సేకరణ కేంద్రాలు మంజూరయ్యాయి. ఏప్రిల్ చివరికి మొత్తం నిర్మాణాలు పూర్తవుతాయి. జిల్లాలో ఎవరైన గ్రూప్‌గా ఏర్పాడి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తాం. – ఏవీఎస్‌వీ జమదగ్ని,
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి
ఎంతో ప్రయోజనం
మామిడి సేకరణ కేంద్రాలు మామిడి రైతులకు ఎంతో ప్రయోజనం. గతంలో చిన్న చిన్న పాకల్లో మామిడిని ఉంచేవారం. ప్రస్తుతం ఈ కలెక్షన్ సెంటర్‌లో పండించిన పంటను ఉంచి విక్రయాలు చేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం ఈ నిర్మాణానికి అత్యధికంగా 75శాతం రాయితీ అందిస్తుంది. జామి మండలం లొట్లపల్లిలో సెంటర్‌కు విశాఖ, విజయనగరం జిల్లాలకు చెందిన రైతులు పండించిన మామిడి పంటలను తీసుకువస్తారు.
– లగుడు దేముడు,
మామిడి ఉత్పత్తుల రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
