ఆ స్థలమే.. రంగస్థలం

 దేవుడికి వెలి నాటిక దృశ్యం(ఫైల్‌)  - Sakshi

శ్రీకాకుళం కల్చరల్‌: అక్కడ పాత్రలకు ప్రాణప్రతిష్ట జరుగుతుంది. అచ్చోట మాట మంత్రంగా మార్పు చెందుతుంది. అనంత జీవితం అణువంత సన్నివేశంలో అర్థమవుతుంది. చప్పట్ల చప్పుడు కళాకారుడి ఆకలి తీరుస్తుంది. ఆ అపురూపమైన స్థలమే.. రంగస్థలం. జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నుంచి జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు జరగనున్నాయి. 2014 నుంచి ఈ నాటిక పోటీలు అప్రతిహతంగా జరుగుతూనే ఉన్నాయి. సినిమాల ప్రభావం పెరిగి రంగస్థలం ఊపు తగ్గాక.. నాటిక ప్రదర్శనలు బాగా తగ్గిపోయాయి. అక్కడక్కడా దాతల సాయంతో పో టీలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో శ్రీకాకుళంలోని సుమిత్రా కళాసమితి సభ్యులు 2014 నుంచి నాటిక పోటీలు నిర్వహించడానికి పూనుకున్నారు. వాస్తవానికి ఒక్క నాటక కళకే కాకుండా అన్నింటికీ ప్రోత్సాహం ఇచ్చేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. నాటి నుంచి ఏటా రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా మూడురోజుల పాటు ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఒక ప్రముఖ కళాకారుని జ్ఞాపకార్థం పోటీలను నిర్వహిస్తోంది. మొదటిసారి ఇప్పిలిభాస్కరరావు (బాల య్య) నాటిక పోటీలు 2014లో నిర్వహించారు. అలాగే 2015లో మెట్ట అప్పారావునాయుడు స్మారక పోటీలు నిర్వహించారు. 2016 ఎంఎస్‌ఎస్‌ పరబ్ర హ్మం స్మారక పోటీలు నిర్వహించారు. 2017లో బహుభాషా నాటిక పోటీలను నిర్వహించారు. హిందీ,తెలుగు, బెంగాలి, ఉర్దూ, పంజాబీ, ఒడిశా, తమిళం, కన్నడం భాషలలో నాటిక పోటీలను 5రోజుల పాటు నిర్వహించారు. 2018 సినీ నటి, నాటక కళాకారిణి ముద్దాడ దమయంతి పేరుతో నాటిక పోటీలు జరిగాయి. 2019లో ప్రముఖ గజల్‌ కళాకారుడు ప్రధాన ఆదినారాయణ జ్ఞాపకార్థం నాటిక పోటీలు నిర్వహించారు. 2022లో సుమిత్రా కళాసమితి పేరుతో నిర్వహించారు. అలాగే 2023లో జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలను నిర్వహిహిస్తున్నారు. ఏటా ఒక రంగస్థల నటుడిని పిలిచి సత్కరిస్తున్నారు. 2015లో సురభి సంస్థ సభ్యులను తీసుకొచ్చి వారం రోజులు పౌరాణిక ప్రదర్శనలు ఇప్పించారు.

25 నుంచి శ్రీకాకుళంలో జాతీయ స్థాయి ఆహ్వాన నాటికపోటీలు

తొమ్మిదేళ్లుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్న సుమిత్ర కళా సమితి

అన్ని కళలకు ప్రోత్సాహం

అన్ని కళలను ప్రోత్సహించడ మే మా ఉద్దేశం. అలాగే కళాకారులకు సాయం అందించ డం చేస్తున్నాం. ఇటీవల కరోనా సమయంలో కళాకారులకు బియ్యం, కూర లు, డబ్బులు కూడా ఇచ్చాం. నాటక కళను కూడా బతికించడం కోసం మేము కృషి చేస్తున్నాం. మా కృషికి ఎంతోమంది దాతల సహకారం కూడా ఉంది. – ఇప్పిలి శంకరశర్మ, సుమిత్ర కళాసమితి అధ్యక్షుడు

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top