
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, టెక్కలి మండలం విక్రంపురంలో పాములు జనావాసాల్లోకి వచ్చి భయపెట్టాయి. పురుషోత్తపురంలో స్థానిక రైస్ మిల్లు పక్క నుంచి సోమవారం ఉదయం సుమారు పది అడుగుల పసిడికి పాము జనాల్లోకి వచ్చింది. దీంతో కొంతమంది యువకులు ధైర్యం చేసి కర్రలతో కొట్టి చంపారు. అలాగే విక్రంపురంలో ఆదివారం రాత్రి నలుపు, పసుపు ఛారలతో ఉన్న సుమారు 15 అడుగుల పాము వీధుల్లోకి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పామును చూసి ఉండకపోవడంతో భయాందోళన చెందారు. కొంతమంది కర్రలతో వెంబడించడంతో సమీపంలోని చెరువు వైపు వెళ్లిపోయింది. కాగా ఈ పామును గౌరీబెత్తుగా పిలుస్తారని స్థానికులు తెలిపారు.
– సరుబుజ్జిలి, టెక్కలి రూరల్
